Loading...
Gold & Silver prices:లాభాల స్వీకరణ తర్వాత స్వల్పంగా కోలుకున్న బంగారం.. మరింత తగ్గిన వెండి..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
మరింత తగ్గిన వెండి..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold & Silver prices:లాభాల స్వీకరణ తర్వాత స్వల్పంగా కోలుకున్న బంగారం.. మరింత తగ్గిన వెండి..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

గత నాలుగు-ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఇంకా తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఇటీవల బంగారం,వెండి ధరలు భారీగా పెరిగి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో వాటి రేట్లు కిందికి దిగివచ్చాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం బంగారం మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4 ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,53,940 వద్ద నిలిచింది.

వివరాలు 

స్థిరీకరణ దశలోకి వెండి ధరలు

అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,41,110కు చేరుకుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,090గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు రూ.1,41,260గా నమోదైంది.

ఇక మరోవైపు ఇటీవల భారీగా ఎగబాకిన వెండి ధరలు ఇప్పుడు స్థిరీకరణ దశలోకి వెళ్లుతున్నాయి.

ఒక దశలో కిలో వెండి ధర రూ.4.25 లక్షల స్థాయిని తాకగా, కొద్ది రోజుల్లోనే భారీ పతనంతో రూ.3 లక్షల దిగువకు చేరింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

విజయవాడలో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

ఢిల్లీలో రూ. 1,54, 090, రూ. 1, 41, 260

ముంబైలో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

వడోదరలో రూ. 1,53, 990, రూ. 1, 41, 160

కోల్‌కతాలో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

చెన్నైలో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

బెంగళూరులో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

కేరళలో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

పుణెలో రూ. 1,53, 940, రూ. 1, 41, 110

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ. 2, 99, 900

విజయవాడలో రూ. 2, 99, 900

ఢిల్లీలో రూ. 2, 79, 900

చెన్నైలో రూ. 2, 99, 900

కోల్‌కతాలో రూ. 2, 79, 900

కేరళలో రూ. 2, 99, 900

ముంబైలో రూ. 2, 79, 900

బెంగళూరులో రూ. 2, 79, 900

వడోదరలో రూ. 2, 79, 900

అహ్మదాబాద్‌లో రూ. 2, 79, 900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT