
Haryana Officer suspend: ఆప్ అభ్యర్థి పోల్ ప్యానెల్ డాక్యుమెంట్‌లో అనుచిత పదజాలం: హర్యానా అధికారి సస్పెండ్
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా అధికారి బ్రహ్మ ప్రకాష్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం సస్పెండ్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఎన్నికల ప్రచారం కు సంబంధించి అనుమతి కోరుతూ ఇచ్చిన పత్రంపై ఆయన అనుచిత పదజాలం ఉపయోగించడంతో పాటు అనుమతిని నిరాకరించారు.
హర్యానా ఆప్ అధినేత సుశీల్ గుప్తా జిల్లాలో ఎన్నికల ర్యాలీలకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో దరఖాస్తు చేశారు.
అయితే కైతాల్ ఎస్డీఎం కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్‌లలో ఒకరు ఆ పత్రంపై 'అనుచితమైన భాష' ఉపయోగించి ర్యాలీలకు అనుమతి నిరాకరించారు.
కైతాల్‌లోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ బ్రహ్మ ప్రకాష్ ఆ ఐదుగురు కంప్యూటర్ ఆపరేటర్లనుంచి వివరణ కోరి వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
Bandaru Dathathreya
ఎన్నికల సంఘానికి ఆప్ ఫిర్యాదు
అయితే ఎన్నికల ర్యాలీలకు అనుమతి నిరాకరణతో పాటు అనుచిత పదజాలాన్ని ఉపయోగించడంపై ఆప్ తీవ్రంగా స్పందించింది.
ఇలాంటి అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించడం కంటే అవమానకరం మరొకటి ఉండదని ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
దీంతో బ్రహ్మ ప్రకాష్ ను కూడా గవర్నర్ బండారు దత్తాత్రేయ సస్పెండ్ చేశారు.