LOADING...
WI vs ZIM : వాంఖడేలో వెస్టిండీస్ విలయతాండవం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం
వాంఖడేలో వెస్టిండీస్ విలయతాండవం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం

WI vs ZIM : వాంఖడేలో వెస్టిండీస్ విలయతాండవం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో వెస్టిండీస్ జట్టు అసాధారణ ప్రదర్శనతో జింబాబ్వేను మట్టికరిపించింది. కేవలం మ్యాచ్ గెలవడమే కాదు 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం ద్వారా విండీస్ చరిత్రలో మరో మైలురాయిని దాటింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది వెస్టిండీస్‌కు రెండో అతిపెద్ద విజయంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఘన విజయంతో విండీస్ సెమీఫైనల్ దిశగా బలమైన అడుగులు వేస్తుండగా, టీమిండియాకు సంబంధించిన సెమీస్ ఆశలపై గట్టి ప్రభావం చూపింది, ఎందుకంటే విండీస్ నెట్ రన్ రేట్ అమాంతం పెరిగింది. విండీస్ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించారు.

Details

హెట్మెయర్ 34 బంతుల్లో 85 పరుగులు

నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించడం విశేషం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరుగా నమోదు అయింది. షిమ్రాన్ హెట్మెయర్ కేవలం 34 బంతుల్లో 85 పరుగులు చేసి మైదానంలో విలయ తాండవం చేశారు, అలాగే కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు పడినందున వారి బ్యాటింగ్ దశం ఎంత దృఢంగా ఉన్నదో అర్థమవుతుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే, విండీస్ బౌలర్ల ధాటికి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే వరకు 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.

Details

జింబాబ్వే 147 పరుగులకే అలౌట్

టాప్ ఆర్డర్ విఫలమయ్యే వలన, 100 పరుగులు దాటకముందే జింబాబ్వే సగం జట్టు పేవిలియన్‌ బాట పట్టింది. చివరికి ఎనిమిదో నంబర్ బ్యాటర్ బ్రాడ్ ఇవాన్స్ (43) కొంత పరుగులు సాధించినప్పటికీ, జట్టు మొత్తం 147 పరుగులకే కుప్పకూలింది (17.4 ఓవర్లలో). విండీస్ బౌలర్లలో గూడాకేష్ మోతీ 4 వికెట్లు, అకీల్ హుస్సేన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయం ద్వారా వెస్టిండీస్ గ్రూప్ స్టేజ్‌లో 4 + సూపర్-8లో 1 = మొత్తం 5 వరుస విజయాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

Advertisement

Details

గ్రూప్ Aలో అగ్రస్థానం

ప్రస్తుతం గ్రూప్-A పాయింట్ల పట్టికలో విండీస్ అగ్రస్థానంలోకి ఎగబాకి, వారి నెట్ రన్ రేట్ +5 దాటింది. ఇది టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది, ఎందుకంటే భారత్ నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే, వారి తదుపరి మ్యాచ్‌లను గెలిచినా, రన్ రేట్ పరంగా వెస్టిండీస్‌ను దాటడం చాలా కష్టమని అభిమనులు భావిస్తున్నారు. ఇప్పుడు భారత అభిమానులు ఒకే కోరిక - సౌతాఫ్రికా జట్టు విండీస్‌ను ఓడించాలి, తద్వారా భారత జట్టు సెమీస్ దిశగా అవకాశాలను ఉపయోగించుకోవాలి.

Advertisement