Loading...
Amit Shah: 'పదవులు శాశ్వతం కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం'.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
'పదవులు శాశ్వతం కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం'.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన

Amit Shah: 'పదవులు శాశ్వతం కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం'.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలకు పదవుల కంటే దేశ ప్రయోజనాలు, యువత, విద్యార్థుల సంక్షేమమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా అదే సిద్ధాంతానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తూ, పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

వివరాలు 

'ఎక్స్' వేదికగా అమిత్ షా స్పందన

సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో అమిత్ షా చేసిన పోస్టులో, "బీజేపీ కార్యకర్తలకు ఏ పదవికంటే దేశం, యువత, విద్యార్థుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైనవి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం ఈ సిద్ధాంతాన్ని మరోసారి చాటిచెబుతోంది" అని పేర్కొన్నారు.

అదే పోస్టులో పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడే దిశగా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

వివరాలు 

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో రాజీనామా

నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. గత కొన్ని వారాలుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.

ఈ పరిణామాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆందోళనలు విరమించిన సీజేపీ

కేంద్ర ప్రభుత్వం తమ మూడు ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో సీజేపీ (CJP) తమ నిరసనలను విరమించింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలను వారు ప్రధాన డిమాండ్లుగా ముందుంచారు.

ప్రభుత్వం ఈ డిమాండ్లను అంగీకరించిన అనంతరం ఆందోళనలను నిలిపివేస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది.

ADVERTISEMENT