LOADING...
Vijay- Rashmika: ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్.. అతిథులకు జపనీస్ స్పెషల్ విందు
ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్.. అతిథులకు జపనీస్ స్పెషల్ విందు

Vijay- Rashmika: ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్.. అతిథులకు జపనీస్ స్పెషల్ విందు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో తన క్యూట్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి ఫైనల్ ముహూర్తం ఖరారైంది. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒకటిగా ఐక్యమవుతుంది. సోమవారమే విజయ్, రష్మిక తమ కుటుంబసభ్యులతో సహా ఉదయ్‌పూర్‌కు చేరుకుని, 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్' వద్ద ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఏర్పాటు అయ్యింది. మంగళవారం నుంచి హల్దీ, సంగీత్ వంటి వివాహానికి ముందే జరిగే ప్రత్యేక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు అత్యంత ప్రైవేట్‌గా, కేవలం 50-100 మంది అత్యంత సన్నిహితుల మధ్యనే నిర్వహించనున్నారు.

Details

మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్

వివాహానికి హాజరయ్యే అతిథుల కోసం 'నో-ఫోన్' పాలసీ కఠినంగా అమలు అవుతుంది. అలాగే, రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించినట్టుగా, అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలను ఏర్పాటు చేశారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన విజయ్-రష్మిక జంట, ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో కలిసిపోతున్నారు. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Advertisement