ఉలిక్కిపడ్డ ఆఫ్ఘనిస్తాన్.. మరోసారి బాంబు పేలుడు
ఎప్పుడూ బాంబుల మోతతో నిత్యం సంఘర్షణకు గురయ్యే దేశంలో అఫ్ఘనిస్తాన్ ది ముందు వరుస. కారణం ఆ దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట గొడవలు, అల్లర్లు, మానవ బాంబులు, బాంబు పేలుడ్లు జరగడమే. రెండు రోజుల కిందట డిప్యూటీ గవర్నర్ అహ్మదీ కారు బాంబు పేలుడులో మరణించగా, నేడు ఆయన స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో మరోసారి పేలుడ్లు సంభవించాయి. ఈ మేరకు సమాచార, సంస్కృతిక ప్రాంతీయ డైరెక్టర్ మొజుద్దీన్ అహ్మదీ పేలుడును ధృవీకరించారు. ప్రస్తుతానికి వివరాలేమీ చెప్పాలేమని, పేలుడు మాత్రం భారీగా జరిగిందన్నారు. స్మారక కార్యక్రమానికి తాలిబాన్ అధికారులు, స్థానిక ప్రజలు హాజరయ్యారన్నప్రాంతీయ డైరెక్టర్, తాము మసీద్ లోపల ఉండగానే పేలుడు సంభవించిందన్నారు.
పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేం, దర్యాప్తు కొనసాగిస్తున్నాం : ప్రాంతీయ డైరెక్టర్
ఆఫ్ఘన్ లోని ఈశాన్య బదక్షన్ ప్రావిన్స్‌లో గవర్నర్ స్మారక కార్యక్రమం జరుగుతుండగా గురువారం బాంబుల మోత మోగినట్టు ప్రాంతీయ డైరెక్టర్ స్పష్టం చేశారు. అహ్మదీ స్మారకం నిర్వహిస్తున్న ప్రాంతం నబావి మసీదు సమీపంలోనే తాజా పేలుడు సంభవించిందన్నారు. ఈ దాడిలో ప్రాణనష్టం కూడా జరిగిందని, పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. మంగళవారం బదక్షన్ రాజధాని ఫైజాబాద్‌లో గవర్నర్ అహ్మదీ తన డ్రైవర్‌తో కలిసి కారు బాంబు దాడిలో చనిపోయారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రాంతీయ అనుబంధ సంస్థ - ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ స్టేట్ అని పిలుస్తారు. దాడి చేసింది తామేనని ఆ సంస్థ ప్రకటించుకుంది. పేలుడు పదార్థాలతో కూడిన కారును రోడ్డుపై పార్క్ చేసి పేల్చివేసినట్లు ఐఎస్ తెలిపింది.