CM Stalin: జాతీయ గీతంపై వివాదం.. సీఎం స్టాలిన్‌పై గవర్నర్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు మరింత ముదురుతున్నాయి.
ముఖ్యంగా శాసనసభ తొలి సమావేశంలో జాతీయ గీతం ఆలపించలేదన్న కారణంగా గవర్నర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి నిష్క్రమించడంపై వివాదం చెలరేగింది.
ఈ పరిణామం గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్‌ల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది.
తాజాగా తమిళనాడు రాజ్‌భవన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ, ఆయనకు అంత అహంకారం మంచిది కాదని పేర్కొంది.
'జాతీయ గీతాన్ని గౌరవించాలని, రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక విధులు నిర్వర్తించాలని చెప్పడాన్ని సీఎం స్టాలిన్ అసంబద్ధంగా, చిన్నపిల్లల చేష్టగా అభివర్ణించడం దురదృష్టకరమని చెప్పారు.
Details
గవర్నర్ తీరు చిన్నపిల్లల చేష్టలా ఉంది
దేశ ప్రజలు రాజ్యాంగానికి, జాతీయ గీతానికి అవమానం సహించరని, దేశాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించని నేత అహంకారంతో వ్యవహరించడం సరికాదని రాజ్‌భవన్ ట్విట్టర్‌లో స్పందించింది.
అంతకుముందు రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. అన్ని శాసనసభల్లో గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీగా ఉందని, తమిళనాడులో మాత్రం ఉద్దేశపూర్వకంగా దీన్ని నిరాకరించారని పేర్కొంది.
గవర్నర్ చర్యలపై సీఎం స్టాలిన్ గట్టిగా స్పందిస్తూ, 'గవర్నర్ తీరు చిన్నపిల్లల చేష్టలా ఉందని, రాజ్యాంగాన్ని అవమానించే ఈ చర్యలు ఆయన పదవికి అసంగతంగా ఉంటాయని ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించారు.
శనివారం కూడా సీఎం స్టాలిన్ గవర్నర్‌పై విమర్శలు చేశారు. తమిళనాడు అభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.