వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నాలుగోసారి వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచేందుకు నిర్ణయించింది.వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం గమనార్హం. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో బుధవారం పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్వహించింది.ఈ క్రమంలోనే తీసుకున్న పలు శుక్రవారం గవర్నర్ ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. MSF, బ్యాంక్ రేటు సైతం 6.75 శాతం వద్దే స్థిరంగా కొనసాగిస్తున్నారు. గత ఆగస్ట్ ఎంపీసీ భేటీతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగింది.వృద్ధి బలంగానే ఉన్నా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు దూకుడుతో అంతర్జాతీయంగా పలు అంశాలు ప్రతికూలమయ్యాయి.