RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది. ఈ మేరకు అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.2000 పెద్ద నోటును ఉపసంహరిస్తున్నామని గత మేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకుగానూ నోటు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఈ గడువు కాస్తా నేటితో ముగియనుండటంతో అక్టోబర్ 7 వరకు మరోసారి గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్, 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు స్వయంగా మోదీ ప్రకటించారు.
మార్చ్ 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం
ఈ మేరకు రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చింది. భారతీయ కరెన్సీలోకి ప్రవేశించిన రూ.2000 నోటు దాదాపు 7 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంది. అవినీతి నిర్మూలన, నల్లధనం, నకిలీ కరెన్సీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన డీమానిటైజేషన్‌లో భాగంగానే రూ.2000నోటు విడుదలైంది. ఇటీవలే 2023 మార్చ్ 19న రూ.2 వేల నోటును ఉపసంహరిస్తూ ఆర్.బి.ఐ సంచలన ప్రకటన చేసింది. నోటు మార్పిడికి 4నెలల గడువును విధించింది. ఇంకా అనేక మంది నోటు మార్పిడి చేసుకోవాల్సి ఉన్న కారణంగా మరోసారి గడువును అక్టోబర్ 7వరకు పోడిగించింది.