రూ.2వేల నోట్ల మార్పిడికి రేపటితో గడువు ముగింపు.. వీటిని ఎక్కడెక్కడ తీసుకుంటారో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
పెద్ద నోట్లు మార్పిడి అంటే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రేపే ఆఖరి తేదీ.ఈ మేరకు గతంలోనే ఆర్ బి ఐ ప్రకటించింది.
రూ. 2 వేల నోట్లు రద్దు అయ్యాక, గత మేలో వాటిని చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించిన ఆర్బీఐ, ఆయా నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది.
ఈ క్రమంలోనే డిపాజిట్ చేసేందుకు లేదా నగదుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది.
అయితే సెప్టెంబర్ 30,శనివారం 2వేల నోట్లు కలిగి ఉన్నవారు ఎవరైనా,డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం చేయకపోతే ఏం జరగనుందో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
రేపటిలోగా 2 వేల నోట్లను డిపాజిట్ చెయకపోతే ఆ నోట్లు చెల్లవని, డబ్బు నష్టపోయినట్టేనని భావిస్తున్నారు.
details
19 ఆర్బీఐ రీజనల్ కార్యాలయాల్లో మార్పిడికి అవకాశం ఇవ్వొచ్చు
ఇప్పటికే సెప్టెంబర్ 30 ముగిసిన తర్వాత 2 వేల నోట్లను ఏమవుతాయి. వీటిని ఇంకెవరు తీసుకుంటారు లాంటి అంశాలపై ఎన్నో సందేహాలున్నాయి.
నోట్ల డిపాజిట్ కి సంబంధించి సెప్టెంబర్ 30 ఆఖరి తేదీ అనంతరం ఆర్బీఐ గడువు పెంచుతుందని కొందరు ఊహిస్తున్నారు. మరికొందరు రూ. 2వేల నోటుతో ఎలాంటి లావాదేవీలు జరగవని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 1నాటికే రూ. 2వేల నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేశాయి. దీంతో గడువు పొడిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం రూ. 2వేల నోటు లీగల్ టెండర్ షరతు కొనసాగుతోంది. రూ.2 వేల నోట్లను 19 ఆర్బీఐ రీజనల్ కార్యాలయాల్లో మార్పిడికి అవకాశం ఇవ్వొచ్చు. ఐడీ, అడ్రస్ ఫ్రూఫ్ చూపించాకే ఆర్బీఐ నోట్లను స్వీకరించే అవకాశం ఉంది.