LOADING...
తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్‌ దుర్మరణం
తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్‌ దుర్మరణం

తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్‌ దుర్మరణం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 06, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌ దేశంలో తాలిబన్లకు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. బదాక్షన్‌ ప్రావిన్స్‌ ఉప గవర్నర్‌ నాసిర్‌ అహ్మద్‌ అహ్మది కారుబాంబు పేలుడులో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగిందని ప్రావిన్షియల్‌ అధికారిక ప్రతినిధి తెలిపారు. కారు బాంబు పేలుడులో నాసిర్‌, ఆయన డ్రైవర్‌ మరణించారని, ఘటనపై ప్రావిన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీస్‌ అధిపతి ముజాహిద్దీన్‌ అహ్మది వెల్లడించారు. మరో ఆరుగురు పౌరులు సైతం ఈ ఘటనలో గాయపడ్డారన్నారు. పేలుడు వెనుక ఉన్నదెవరో ఇంకా తెలియరాలేదన్నారు. చాలా కాలం తర్వాత తాలిబన్‌ పాలనలో సంభవించిన అతిపెద్ద పేలుడు ఇదేనన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారులో పేలుడు పదార్థాలను నింపుకుని నాసిర్ వాహనం వద్దకు దూసుకొచ్చి పేల్చేసుకున్నాడని చెప్పారు.

Deputy Governor Dead in a Human Car Bomb Blast

ఐసిస్ ఉగ్రవాదులను తాలిబన్ల ప్రభుత్వం ఏరేస్తుంది : అధికార ప్రతినిధి

మరోవైపు ఐసిస్‌ ఉగ్రవాదులు అఫ్గాన్ పరిధిలోని పలు నగరాల్లో తీవ్రమైన దాడులకు పూనుకున్నారు. ఈ మేరకు మార్చిలో బల్ఖ ప్రావిన్స్‌ గవర్నర్‌ను తామే హత్య చేసినట్లు ఇప్పటికే ఆ సంస్థ స్పష్టం చేసింది. 2022 డిసెంబర్‌లో ఇదే ప్రావిన్స్‌లో ఓ పోలీస్‌ చీఫ్‌ను పేలుడు బాంబుతోనే ఐసిస్‌ ఉగ్ర సంస్థ హత్య చేసింది. అక్కడితో ఆగకుండా ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో అఫ్గాన్ గనుల శాఖ అధిపతిని సైతం పేలుడులో పొట్టనబెట్టుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఐసిస్‌ ఉగ్రవాదులను ఏరి వేసేందుకు తాలిబన్‌ సర్కార్ ఇప్పటికే దాడులను ముమ్మురంగా కొనసాగిస్తోందని అధికార ప్రతినిధి చెప్పారు. ప్రావిన్స్‌లో సాంస్కృతిక, సమాచార విభాగానికి డిప్యూటీ గవర్నర్ హోదాలో నాసిర్‌ అహ్మద్‌ అహ్మది సారథ్యం వహిస్తున్నారు.