S Jaishankar: చమురు కొనుగోళ్లలో రాజకీయ ప్రభావం ఉండదు: జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ప్రభావితం చేయవని, పూర్తిగా జాతీయ ప్రయోజనాల పరంగా తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పారు. జర్మనీలోని మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొన్న సందర్భంలో జై శంకర్ ఒక ప్రశ్నకు స్పందిస్తూ, భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను ముందుగా చూస్తుందన్నారు.
Details
సుంకాలు 18శాతం తగ్గింపు
ఇంధన సమస్యల విషయానికి వస్తే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సంక్లిష్టమైనవని, భారత్‌లోని చమురు కంపెనీలు యూరప్ సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తాయని చెప్పారు. అందులో ఖర్చులు, నష్టాలు, లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఇక అమెరికాతో ఇటీవల భారత్‌కు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ఫలితంగా భారత దిగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించింది. ఆ దేశం రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి కట్టుబడి ఉందని కూడా ప్రకటించింది. అయితే ఈ విషయంపై భారత్ ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వలేదు.