LOADING...
Vikram-1: విక్రమ్‌-1 ప్రయోగం వాయిదా.. కొత్త నోటామ్‌ జారీ చేసిన షార్
విక్రమ్‌-1 ప్రయోగం వాయిదా.. కొత్త నోటామ్‌ జారీ చేసిన షార్

Vikram-1: విక్రమ్‌-1 ప్రయోగం వాయిదా.. కొత్త నోటామ్‌ జారీ చేసిన షార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 మిషన్‌ ప్రయోగం వాయిదా పడింది. ఈమేరకు మిషన్‌ ఆగమన్‌కు సంబంధించి కొత్త నోటామ్‌ శుక్రవారం అధికారులు విడుదల చేశారు. తాజా నోటామ్‌ ప్రకారం,తొలుత జులై 12ను లక్ష్యంగా నిర్ణయించిన ప్రయోగ షెడ్యూల్‌ను మార్చి,జులై 18నుంచి ఆగస్టు 4వరకు కొత్త ప్రయోగ కాలపరిమితిని నిర్ణయించారు. ఈనేపథ్యంలో గతంలో జారీ చేసిన నోటామ్‌ను అధికారికంగా రద్దు చేశారు. కొత్త నోటామ్‌ విడుదలతో విక్రమ్‌-1 ప్రయోగం కనీసం వచ్చే వారానికి వాయిదా పడినట్లు స్పష్టమైంది. కొత్త షెడ్యూల్‌లో అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే షార్‌ కేంద్రం నుంచి ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విక్రమ్‌-1 మిషన్‌పై కొత్త నోటామ్‌.. పాత నోటిఫికేషన్‌ రద్దు

Advertisement