
Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.
రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డి.శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.
తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై రఘురామ్ రాజన్‌తో రేవంత్ రెడ్డి చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాజన్ కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా రఘురామ్ రాజన్ పని చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ సీఎంఓ ట్వీట్
సీఎం శ్రీ @Revanth_Anumula గారితో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శ్రీ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం శ్రీ రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక… pic.twitter.com/9KlgpMD5XA
— Telangana CMO (@TelanganaCMO) December 17, 2023