బ్రిటన్: వార్తలు

25 Mar 2023

అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ప్రవాస భారతీయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాన్సులేట్‌ భవనం వెలుపల గుమిగూడి భారత్‌కు సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు.

20 Mar 2023

దిల్లీ

భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు కిందకు లాగిన ఘటన సంచలనంగా మారింది.

లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.

'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం

భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరప్‌ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్

దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా 5డాలర్ల నోటుపై బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఫొటో స్థానంలో దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త డిజైన్‌తో కరెన్సీ నోటు తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

30 Jan 2023

రష్యా

నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను చంపేస్తానని బెదిరించారని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. యూకేపై క్షిపణిని వదలడానికి తనకు ఒక నిమిషం మాత్రమే పడుతుందని పుతిన్ హెచ్చిరినట్లు జాన్సన్ వెల్లడించారు. బీబీసీ రూపొందించిన 'పుతిన్ v ది వెస్ట్' అనే మూడు భాగాల డాక్యుమెంటరీలో ఈ సంచలన విషయాలను వెల్లడయ్యాయి.

సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా

సీటు బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించినందుకు ప్రధానమంత్రి రిషి సునక్‌కి యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులు జరిమానా విధించినట్లు బీబీసీ తెలిపింది. కదులుతున్న కారులో సీటుబెల్టు ధరించనందుకు అతనికి 50ఫౌండ్ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రిషి సునక్‌కు క్షమాపణలు చెప్పారు. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నారు.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి.