Keir Starmer: హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న మొదటి ప్రధాని స్టార్మర్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ (UK) ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ (Keir Starmer) హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు.
జీ7 దేశాల నాయకులలో బహిరంగంగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధాని స్టార్మర్ అని ఆయన కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ ముందుకొచ్చి హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
"హెచ్‌ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి స్టార్మర్ టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్‌తో కలిసి ర్యాపిడ్ హోమ్ టెస్టు చేయించుకున్నారు" అని ఆయన కార్యాలయం వెల్లడించింది.
వివరాలు
వారం పాటు ఉచితంగా అందుబాటులో హెచ్‌ఐవీ పరీక్ష
హెచ్‌ఐవీ పరీక్ష అత్యంత కీలకమైనదని, అందులో పాల్గొనడం తనకు గౌరవంగా అనిపించిందని స్టార్మర్ తెలిపారు.
కేవలం కొన్ని క్షణాల్లో పూర్తయ్యే ఈ పరీక్షను ఒక వారం పాటు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నామని ఆయన వెల్లడించారు.
2030 నాటికి కొత్త హెచ్‌ఐవీ కేసులు పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టార్మర్, ప్రజలు ముందుకొచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన పూర్తిగా కట్టుబడి ఉన్నారని, దీనికి అనుగుణంగా ఈ సంవత్సరంలోనే ప్రత్యేక చర్యల ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించనున్నట్లు ఆయన కార్యాలయం పేర్కొంది.