Union Budget 2026: బడ్జెట్ ప్రసంగంలో మార్పు.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్ పెట్టనున్న నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా అడుగులు వేయనున్నట్లు సమాచారం. ఆమె బడ్జెట్ ప్రసంగ నిర్మాణంలో కీలక మార్పులు చేయనున్నారని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 2026 వార్షిక బడ్జెట్ (యూనియన్ బడ్జెట్ 2026)లో పార్ట్-ఎ కంటే పార్ట్-బిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పార్ట్-ఎలో దేశ ఆర్థిక పరిస్థితి, గణాంకాలు, ప్రధాన విధాన ప్రకటనలకు సంబంధించిన అంశాలుంటాయి. ఇక పార్ట్-బిని పన్ను ప్రతిపాదనలు, సాంకేతిక స్వభావం ఉన్న ప్రకటనలకే పరిమితం చేసి, వాటిని సంక్షిప్తంగా వివరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
Details
ప్రభుత్వ ఆర్థిక వ్యూహాన్ని మరింత స్పష్టంగా వివరించే అవకాశం
అయితే ఈసారి ఆ రెండో భాగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘంగా చదివే అవకాశం ఉందని సమాచారం. వెంటనే అమలులోకి వచ్చే విధానపరమైన నిర్ణయాలతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రసంగంలో ఈ మార్పు ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యూహాన్ని మరింత స్పష్టంగా వివరించాలన్న లక్ష్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.