Page Loader
Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

వ్రాసిన వారు Stalin
Feb 26, 2024
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు తిప్పి పంపారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కశ్మీరీ పండిట్ అయిన ప్రొఫెసర్ నితాషా కౌల్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, ఎటువంటి కారణం లేకుండానే తిరిగి లండన్‌కు పంపించారని కౌల్ ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. తాను భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం ఇంతకు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని నితాషా కౌల్ పేర్కొన్నారు.

బ్రిటన్

గతంలో ఆర్ఎస్ఎస్‌పై కౌల్ విమర్శలు

ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై మాట్లాడేందుకు తనను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించినట్లు, అందుకే బెంగళూరు వచ్చినట్లు కౌల్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానిస్తే.. కేంద్రం తనను ఆపిందన్నారు. తన వద్ద అన్ని రకాల పత్రాలు ఉన్నా ఆపినట్లు చెప్పారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించినందున భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబోమని అధికారులు అనధికారికంగా తనకు చెప్పినట్లు కౌల్ వివరించారు. నితాషా కౌల్ ప్రొఫెసర్‌గానే కాకుండా, నవలా రచయిత్రి, కవయిత్రి కూడా కావడం గమనార్హం. ఆమె బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రొఫెసర్ నితాషా కౌల్ ట్వీట్