Varanasi : 'వారణాసి' లేటెస్ట్ అప్‌డేట్.. జార్జియా షెడ్యూల్‌కు సిద్ధమైన మహేశ్ బాబు!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని కోకాపేటతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో నిరంతరాయంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
Details
సూమారు 15 రోజుల పాటు షెడ్యూల్
హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైన వెంటనే చిత్ర బృందం విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో మూవీ టీమ్ జార్జియా వెళ్లనుంది. అక్కడ సుమారు 15 రోజుల పాటు కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. జార్జియాలో సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా చిత్రీకరించనున్నారు. ఆ షెడ్యూల్ ముగిసిన అనంతరం యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకుని తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. రాజమౌళి మార్క్ మేకింగ్, హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.
Details
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్
గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు తెరకెక్కిన అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న 'వారణాసి'ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.