Loading...
KARIVEPAKU MUNAGAKU PODI : కరివేపాకు, మునగాకు కారం పొడి.. సులభంగా, హెల్దీగా
కరివేపాకు, మునగాకు కారం పొడి.. సులభంగా, హెల్దీగా

KARIVEPAKU MUNAGAKU PODI : కరివేపాకు, మునగాకు కారం పొడి.. సులభంగా, హెల్దీగా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇడ్లీ, దోసెల్లోకి మాత్రమే కాదు! అన్నంలో కూడా ఉపయోగించవచ్చు. కావాలనిపిస్తే ఎప్పుడు కావాలంటే ఉపయోగించుకునేలా పొడి రూపంలో తయారు చేయవచ్చు. ఈ పొడి తయారీ కేవలం సులభమే కాకుండా, ఆరోగ్యానికి కూడా బాగుంది. ఇంట్లో కర్రీలు చేసే టైం దొరకనపుడు,లేదా ఉదయం ఆఫీసుకు హడావిడిగా వెళ్లాల్సిన సమయంలో ఇది చాలా సౌకర్యవంతం. కరివేపాకు, మునగాకు ప్రత్యేకమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి పొడి రూపంలో ఉంచితే, ఏ సమయంలోనైనా తినటానికి సిద్ధంగా ఉంటుంది.

వివరాలు 

కావలసిన పదార్థాలు:

కరివేపాకు - 4 కప్పులు

మునగాకు - 2 కప్పులు

అవిసెలు - ½ కప్పు

నువ్వులు - ½ కప్పు

నూనె - 2 టేబుల్ స్పూన్లు

మినప్పప్పు - 3 టేబుల్ స్పూన్లు

పచ్చి శనగపప్పు - 3 టేబుల్

స్పూన్లు జీలకర్ర - 1 స్పూన్

ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు

ఎండు మిర్చి - 15

చింతపండు - కొద్దిగా

వివరాలు 

తయారీ విధానం:

ముందుగా 4 కప్పుల కరివేపాకు, 2-3 కప్పుల మునగాకు శుభ్రంగా కడిగి, నీళ్లు పూర్తిగా తుడిచేసి, గాలి వెచ్చని చోట ఆరబెట్టాలి. ఓ క్లాత్ మీద ఆరబెట్టడం వల్ల తడి రాకుండా ఉంటుంది.

చిన్న కడాయి తీసుకుని సన్నని మంటపై అవిసెలను వేయించాలి. మధ్యలో నువ్వులు కూడా కలిపి, మరిగి బాగా వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత స్టవ్ ను ఆపి పక్కన పెట్టండి.

కడాయిలో నూనె వేసి, మినప్పప్పు, పచ్చి శనగపప్పులను సన్నని మంటపై దోరగా వేయించాలి. బాగా వాసన వచ్చే వరకు వేయించాక, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) వేసి వేయించాలి. చివరగా కొద్దిగా చింతపండు ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టండి.

ADVERTISEMENT

వివరాలు 

తయారీ విధానం:

వేయించిన అవిసెలు, నువ్వులను గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పప్పులను చల్లార్చి కలిపి మరోసారి గ్రైండ్ చేయాలి.

కడాయిలో కొద్దిగా నూనె వేసి, శుభ్రం చేసుకున్న కరివేపాకు, మునగాకు ముక్కలుగా కాస్త కొద్దిగా వేయించాలి. మొత్తం ఆకు ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేయాలి. ఆ తర్వాత చల్లార్చి, మిక్సీలో గ్రైండ్ చేయాలి.

మిక్సింగ్ బౌల్ లో గ్రైండ్ చేసిన పప్పులు, అవిసెలు, నువ్వుల మిశ్రమం, కరివేపాకు-మునగాకు పొడి కలిపి బాగా కలపాలి. ఉప్పు, కారం రుచి చూసి అవసరమైతే సర్దుకోవాలి.

ADVERTISEMENT