US Tariffs: అమెరికా వాణిజ్య ఒప్పందంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌కే ఎక్కువ లాభం
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా భారత్,అమెరికా మధ్య మరో కీలక వాణిజ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త ఒప్పందం ప్రకారం,భారత ఉత్పత్తులపై అమెరికా విధించే పన్ను 50 శాతం నుంచి నేరుగా 18 శాతానికి తగ్గనుంది. ఈ ఒప్పందం, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందనే హామీతో కుదిరింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఎలా షాక్ అవుతందనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్,ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్‌తో చాలా సానిహిత్యంగా కలిసినప్పటికీ, వాణిజ్య విషయంలో ఫలితం విరుద్ధంగా వచ్చింది. భారత్ కంటే పాకిస్థాన్‌పై టారిఫ్ ఒక శాతం ఎక్కువగా ఉంది. ఇదే పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన షాకింగ్‌గా చెబుతున్నారు.
వివరాలు
అమెరికా నుంచి చమురు కొనుగోలు
ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ టారిఫ్ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్ ఇకపై అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని,అవసరమైతే వెనిజువెలా నుంచి కూడా కొనుగోలు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలపరిచే అవకాశం కలిగిస్తుందని ట్రంప్ చెప్పారు. ప్రధాని మోదీ ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు. "మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్ను 18 శాతానికి తగ్గించడం ఎంతో సంతోషకరం.ఈ గొప్ప నిర్ణయానికి భారత ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు," అని మోడీ చెప్పారు.
వివరాలు
భారత్ ప్రస్తుతం మెరుగైన స్థితిలో..
రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఎన్నో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో ఆసియా ప్రాంతంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉంది. చైనా, పాకిస్థాన్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే, భారత్‌పై అమెరికా పన్ను తక్కువగా ఉంది. యూరోప్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రదేశాలతో పోలిస్తే, భారత్‌పై పన్ను కొంచెం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అమెరికా.. బ్రెజిల్: 50%,మయన్మార్,లావోస్: 40% చైనా: 37% దక్షిణాఫ్రికా: 30% వియత్నాం, బంగ్లాదేశ్: 20% పాకిస్థాన్,మలేషియా, కంబోడియా,థాయ్‌లాండ్: 19% బ్రిటన్: 10% యూరోప్ యూనియన్,స్విట్జర్లాండ్, జపాన్,దక్షిణ కొరియా: 15%