అమరావతి: వార్తలు

AP Govt: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతాం : ఏపీ ప్రభుత్వం

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ల తరలింపుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

Amaravati: అమరావతి అభివృద్ధి దిశగా కీలక ఆమోదం.. రూ.15వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్

అమరావతి నగర నిర్మాణం, సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణ సహకారం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!

అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది.

Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం

అమరావతి మీదుగా రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. పొడవు ఉన్న రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కీలకమైన అడుగులు పడుతున్నాయి.

Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు.

Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు

రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళిక రవాణా సేవలను మెరుగుపరుస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు .

Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం

అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పనులు సాగుతున్నాయి.

Amaravati: డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు షురూ .. నాలుగేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు

అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు.

18 Aug 2024

ఇండియా

Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్ 

భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు.

Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది.

అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొంది. సీఐడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏసీబీ ఈ విషయాన్ని చెప్పింది.

Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.

అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆమె అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు.

భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ

మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. 57 ఏళ్ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ తన భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు పూర్తిస్థాయి విచారణ కోసం డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఆర్‌ 5 జోన్‌ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 వేలకుపైగా ఇళ్ల పట్టాదారులకు గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ

అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్ 

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణకు బుధవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు 

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

02 Mar 2023

మైలవరం

అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు.