LOADING...
Andhra Pradesh: అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

Andhra Pradesh: అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతిలో ఈ నెల 26న మొదటిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఏడాది విజయవాడలో నిర్వహించేది. కానీ ఇప్పుడు, ఈ వేడుకలను అమరావతిలో నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే భవన సముదాయాల నుంచి హైకోర్టు భవన సముదాయాలకు వెళ్తున్న మార్గంలో సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతానికి, గ్యాలరీలు, వేదిక నిర్మాణం, శకటాల రూపకల్పన వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. పరేడ్ నిర్వహణకు సన్నద్ధత భాగంగా సోమవారం పోలీసులు నమూనా కవాతు కూడా నిర్వహించారు.

Advertisement