Amaravati: అమరావతిలో బ్యాంకులు - బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంఖుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలోని సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిర్మించిన మొదటి బ్లాక్‌లో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన
రాజధాని అమరావతిలో జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని… pic.twitter.com/PtFoDkT8l6
— Telugu Desam Party (@JaiTDP) November 28, 2025