LOADING...
Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?
పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?

Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన పలు కీలక విషయాలు ఈ సర్వేలో పేర్కొన్నాయి. ఏపీలో ఇలా.. ఆర్థిక సర్వే ప్రకారం, ఏపీలో ద్రవ్యోల్బణం తగ్గించే దిశగా స్థిరంగా పురోగతి కనిపిస్తోంది. 2022-23లో 7.57 శాతం ఉన్న ద్రవ్యోల్బణం 2025-26లో 1.39 శాతానికి తగ్గినట్టు వివరించింది. తెలంగాణలో ఇది 8.61 శాతం నుంచి 0.20 శాతానికి దిగినట్లు కూడా ప్రస్తావించింది. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు 1.72 శాతం ద్రవ్యోల్బణానికి తక్కువగా ఉంది.

వివరాలు 

ఏపీలో ఇలా..

అకాల వర్షాలు,ప్రకృతి ప్రకోపాల కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల తేలినట్లు సర్వే తెలిపింది. కొత్త నగరాల అభివృద్ధి, ప్రత్యేకంగా అమరావతి రాజధానిలో హరిత నగర నిర్మాణం అవకాశాలను సర్వేలో ప్రస్తావించడమే కాకుండా,ఆంధ్రప్రదేశ్ వాణిజ్య సంస్కరణల్లో ముందంజలో ఉన్నందున వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందని తెలిపింది. సింగిల్ విండో విధానంలో పారిశ్రామిక అనుమతులను మంజూరు చేయడం,రాష్ట్రంలోని 6,900 గ్రామాల్లో 81 లక్షల భూకమతాల రీసర్వే పూర్తి కావడం, 86 వేల సరిహద్దు వివాదాలు పరిష్కరించబడినట్లు సర్వే వివరించింది. అంతేకాదు, ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. పంజాబ్, గుజరాత్, ఏపీలో విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని కూడా పేర్కొన్నది. దేశంలోని జీవనయోగ్య నగరాల్లో విజయవాడ, తిరుపతి టాప్ 10లో నిలిచాయి.

వివరాలు 

తెలంగాణలో..

తెలంగాణలో సాగు యోగ్య భూ విస్తీర్ణం 2014-23 మధ్య 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.21 కోట్ల ఎకరాలవరకు పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. తయారీ రంగంలో రాష్ట్రం 5 శాతం వాటా సాధించింది. AI స్టార్టప్‌లలో తెలంగాణ 7 శాతం వాటాతో 30 శాతంతో కర్ణాటక తర్వాత రెండవ స్థానం పొందింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసుల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వాటా 40 శాతం స్థాయిలో ఉంది. భూభారతి పోర్టల్ ద్వారా రెవెన్యూ, స్టాంప్, రిజిస్ట్రేషన్ విభాగాలను తెలంగాణ ఏకీకృతం చేసినట్టు పేర్కొంది.

Advertisement

వివరాలు 

తెలంగాణలో..

అత్యధిక పట్టణ జనాభా కలిగిన నగరాల్లో ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో, విజయవాడ 10వ స్థానంలో నిలిచాయి. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 201.4 బిలియన్ డాలర్లు, విజయవాడ జీడీపీ 21.3 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. మున్సిపల్ బాండ్ల జారీలో భాగ్యనగరం అగ్రస్థానంలో ఉంది.

Advertisement