LOADING...
Andhra Pradesh News: అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం..హాజరైన చంద్రబాబు, లోకేశ్‌ 
హాజరైన చంద్రబాబు, లోకేశ్

Andhra Pradesh News: అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం..హాజరైన చంద్రబాబు, లోకేశ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీని నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా.. మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా.. మన్యం జిల్లా చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా.. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా.. తిరుపతి జిల్లా చెందిన చిన్మయి, స్పీకర్‌గా..కాకినాడ జిల్లా చెందిన స్వాతి వ్యవహరించారు. ఈ మాక్ అసెంబ్లీలో ప్రధానంగా సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్స్ పై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 45,000 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారంగా చేశారు.

వివరాలు 

శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్‌ 

రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే బలమైన పునాదిగా నిలుస్తుందని, స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగం మార్గదర్శకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంలో మంత్రి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మన హక్కులను గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యాశాఖ రాజ్యాంగ దినోత్సవాన్ని వినూత్న రూపంలో నిర్వహిస్తున్నట్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించబడుతోందని ఆయన వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమరావతిలో విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ