#NewsBytesExplainer: అమరావతి రాజధాని రీ-వైవల్‌తో ల్యాండ్ ప్రైసెస్ రికార్డ్ స్థాయికి.. ప్రస్తుతం ఇంటి స్థలాల ధరలు ఎంత ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి భూవిలువలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకోవడంతో మార్కెట్ వేడి పెరిగింది. రోడ్ల పనులు, సెక్రటేరియట్, హైకోర్టు భవనాల అభివృద్ధి, రింగ్ రోడ్ ప్రాజెక్టులు తిరిగి ట్రాక్‌లోకి రావడం వల్ల గత ఒక సంవత్సరం కాలంలో రేట్లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ బెల్ట్‌లో ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చిన ప్లాట్లు స్క్వేర్ యార్డుకు దాదాపు 45,000 నుంచి 60,000 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా రాయపూడి, వెలగపూడి, లింగాయపాలెం, మందడం, తుళ్లూరు ప్రాంతాల్లో ఈ రేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది.
వివరాలు
ఒక ఎకరం డెవలప్డ్ ల్యాండ్ ఇప్పుడు 20 నుండి 30 కోట్ల రూపాయల మధ్యలో
ఇతర జోన్‌లలో కూడా పరిస్థితి గట్టిగానే ఉంది. కురగల్లు, నిడమర్రు, ఇనవోలు వైపు 28,000 నుండి 45,000 రూపాయల వరకూ ధర ఉంటే, కాజా-నంబూరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో 24,000 నుంచి 30,000 మధ్య రేట్లు తిరుగుతున్నాయి. తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరి వైపు సాధారణ మార్కెట్ రేంజ్ కూడా 40,000 నుంచి 60,000 రూపాయల వరకూ ఉండటం ట్రెండ్‌ను మరింత బలపరుస్తోంది. ఒక ఎకరం పూర్తిగా డెవలప్ అయిన భూమి ఇప్పుడు 20 నుంచి 30 కోట్ల మధ్యలో డీల్ అవుతుంది.
వివరాలు
ట్రెండ్ కొనసాగే అవకాశం ఎక్కువ..
ఓపెన్ ప్లాట్ల ధరలు 10,000 నుంచి 30,000 రూపాయల మధ్య ఉన్నా,CRDA అనుమతులు, రోడ్డు ఫేసింగ్ వంటి అంశాలు ఉంటేనే ఆ రేంజ్‌ను సులభంగా చేరుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే భూమి ధరలు 40-50% వరకూ పెరిగాయని, వచ్చే 18 నెలల్లో మరోసారి డబుల్ అయ్యే అవకాశముందని CREDAI, స్థానిక రియల్ ఎస్టేట్ డెవలపర్లు భావిస్తున్నారు. ఈ పెరుగుదల ధోరణి ఇంకా కొనసాగుతుందని మార్కెట్ సూచనలు చెబుతున్నాయి.