LOADING...
Amaravati: రూ.1000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో బిట్స్‌ పిలానీ క్యాంపస్
రూ.1000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో బిట్స్‌ పిలానీ క్యాంపస్

Amaravati: రూ.1000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో బిట్స్‌ పిలానీ క్యాంపస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజా రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌ పిలానీ) త్వరలో అమరావతిలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మందడం, వెంకటపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలోని 70.011 ఎకరాల భూమిపై క్యాంపస్‌ ఏర్పాటుకు శుక్రవారం ఏపీ సీఆర్డీఏతో భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మందడం సబ్‌ రిజిస్ట్రార్‌ రాంబాబు సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఏపీ సీఆర్డీఏ ఎస్టేట్స్‌ విభాగ జాయింట్‌ డైరెక్టర్‌ వి. డేవిడ్‌ రాజు, బిట్స్‌ పిలానీ తరఫున అధీకృత ప్రతినిధిగా డిప్యూటీ రిజిస్ట్రార్‌ వి.వి.ఎస్‌.ఎన్‌. మూర్తి పాల్గొన్నారు.

Details

తొలి దశలోనే రూ.1000 కోట్ల పెట్టుబడి

అమరావతి క్యాంపస్‌ నిర్మాణ పనులను మూడు దశల్లో చేపట్టనున్నట్లు బిట్స్‌ పిలానీ ప్రతినిధులు వెల్లడించారు. తొలి దశలోనే రూ.1000 కోట్ల పెట్టుబడితో స్మార్ట్‌ భవనాలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలు, ఆధునిక బోధనా పద్ధతులకు అనుకూలంగా పర్యావరణహిత నిర్మాణాలతో క్యాంపస్‌ను కొత్తతరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 2027 నుంచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో పనులను వేగంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా సుమారు 10 వేల మంది విద్యార్థులు అభ్యసించేలా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

Advertisement