LOADING...
Amaravati Capital Farmers: అమరావతి రాజధాని రైతులకు శుభవార్త.. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ
ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ

Amaravati Capital Farmers: అమరావతి రాజధాని రైతులకు శుభవార్త.. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాజధాని ప్రాంత రైతులకు ఈ రోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో అమలు చేసిన విధానాన్నే కొనసాగిస్తూ, ఇ-లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లను కేటాయించనున్నారు.

వివరాలు 

గ్రామాల వారీగా ప్లాట్ల పంపిణీ ఇలా ఉంది:

నిడమర్రు గ్రామానికి 58 ప్లాట్లు, పిచ్చుకలపాలెంకు 3, అనంతవరానికి 1, పెనుమాకకు 7, లింగాయపాలెంకు 7, వెలగపూడికి 25, మందడంకు 21, మల్కాపురానికి 10, కురగల్లుకు 7, నేలపాడుకు 2 ప్లాట్లు కేటాయించనున్నారు.

వివరాలు 

మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు 

ఈ మేరకు ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇ-లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు. అలాగే, ఉండవల్లి ప్రాంతంలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లను కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఒకవైపు అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తూనే, మరోవైపు భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా భూ సేకరణ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement