LOADING...
Amaravati: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్.. ఏడు గ్రామాల్లో భూ సమీకరణ బాధ్యత CRDA కమిషనర్‌కు అప్పగింత 
ఏడు గ్రామాల్లో భూ సమీకరణ బాధ్యత CRDA కమిషనర్‌కు అప్పగింత

Amaravati: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్.. ఏడు గ్రామాల్లో భూ సమీకరణ బాధ్యత CRDA కమిషనర్‌కు అప్పగింత 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏడు గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూములను సమీకరించడం సీఆర్డీఏ (CRDA) కమిషనర్ బాధ్యతగా అప్పగించబడింది. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో, వైకుంఠపురం గ్రామంలో 1,965 ఎకరాలు,పెద్దమద్దూరు గ్రామంలో 1,018 ఎకరాలు, యంద్రాయ్ గ్రామ పరిధిలో 1,879 ఎకరాలు పట్టా భూములు, అలాగే 46 ఎకరాల అసైన్‌డ్ భూములను సమీకరించనున్నారు.

వివరాలు 

 3,828.30 ఎకరాలు ప్రభుత్వ భూమి 

కర్లపూడి-లేమల్లెల్ ప్రాంతంలో 2,603 ఎకరాల పట్టా భూములు, 51 ఎకరాల అసైన్‌డ్ భూమి సమీకరణలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో, తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురం గ్రామంలో 1,448.09 ఎకరాల పట్టా భూమి, 2.29 ఎకరాల అసైన్‌డ్ భూమి, పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూములు సమీకరణలోకి వస్తున్నాయి. మొత్తానికి, ఈ ప్రాజెక్టులో ఏడు గ్రామాల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు, 104.01 ఎకరాల అసైన్‌డ్ భూములను సమీకరించాలనేది సీఆర్డీఏ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 3,828.30 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమరావతిలో రెండో విడత భూసమీకరణకు ఆదేశాలు

Advertisement