Krishna Flood: భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం.. దిగవకు వరద నీటి విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ విషయంపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు,ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటిని దిగువ ప్రవాహానికి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో),విడుదల (ఔట్‌ఫ్లో) రెండూ 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉన్నాయని చెప్పారు.
వివరాలు
లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత దశలవారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు వివరించారు. లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో ప్రయాణాలు చేయడం, ఈతకు వెళ్లడం లేదా చేపలు పట్టడం వంటి కార్యక్రమాలు చేయకూడదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం
▪️భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 30, 2025
▪️పులిచింతల, ప్రకాశం బ్యారేజి వద్ద దిగవకు వరద నీటి విడుదల
▪️ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు
▪️ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం pic.twitter.com/WJdd285SiF