LOADING...
Amaravati: ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం
ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం

Amaravati: ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమైంది. జరీబు-మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్‌ భూములు, లంక ప్రాంతాల వ్యవసాయ భూములపై ఉన్న ఇబ్బందుల పరిష్కారం కమిటీలో ప్రధాన చర్చాంశాలు కానున్నాయి. రైతులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని కమిటీ దృష్టి సారించింది.

వివరాలు 

ఈ రోజు సాయంత్రం రాజధాని రైతులతో భేటీకానున్న ముఖ్యమంత్రి 

రైతులకు కేటాయించిన ప్లాట్‌లకు హద్దురాళ్లు ఏర్పాటు చేసి, వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కమిటీ, గుంటూరు-మంగళగిరి నుండి అమరావతికి వెళ్లే రహదారుల అభివృద్ధి అంశాన్ని కూడా ఈ సమావేశంలో పరిశీలించనుంది. శనివారం ఉదయం కమిటీ మరోసారి సమావేశమయ్యేలా నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా, ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులతో భేటీ కానున్నారు. రైతులకు సంబంధించిన వివిధ సమస్యలు, వారి అభ్యర్థనలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.