Andhra Pradesh : రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్‌లకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు లభించగా, మరో 10 మంది ఐపీఎస్ అధికారులకు ఉత్కృష్ట సేవా పతకాలు వరించాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు మొత్తం 353 మంది పోలీసులకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు, 607 మందికి ఉత్కృష్ట సేవా పతకాలు అందినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం వెల్లడించారు.
Details
డీఎస్పీ-నాన్ క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారులు
నాదెళ్ల బాలాజీ మారుతీ మురళీకృష్ణ (తూర్పుగోదావరి జిల్లా పరిపాలన విభాగం అదనపు ఎస్పీ) ఎస్‌ఆర్ రాజశేఖర్ రాజు (చిత్తూరు జిల్లా ఆపరేషన్స్ విభాగం), కె. నగేష్ బాబు (అదనపు ఎస్పీ, ఈగల్ విభాగం), డీఎస్పీ గోపు రాజీవ్ కుమార్ (విజిలెన్స్ విభాగం).
Details
డీఎస్పీ-నాన్ క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారులు
బీవీ రమేష్ (అసిస్టెంట్ కమాండెంట్, ఎస్‌ఏఆర్ సీపీఎల్ - ఏపీ యూనిట్), షేక్ షకీలా భాను (ఆర్‌ఐవో, విశాఖపట్నం) కె. ఈశ్వర్ రావు (నాన్ క్యాడర్ ఎస్పీ, సీఐడీ), కె. లతామాధురి (డీసీపీ క్రైమ్స్, విశాఖపట్నం), కేవీ శ్రీనివాసరావు (నాన్ క్యాడర్ ఎస్పీ, సీఐడీ), కరీముల్లా షరీఫ్ (ఆర్‌వీఈవో, తిరుపతి). ఐపీఎస్ అధికారులు మహేష్ చంద్ర లడ్డా (నిఘా విభాగాధిపతి), జీవీజీ అశోక్ కుమార్ (ఏలూరు రేంజ్ ఐజీ), జి. విజయ్ కుమార్ (హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి), ఎస్. హరికృష్ణ (పోలీసు పర్సనల్ విభాగం ఐజీ), ఎం. రవిప్రకాశ్ (ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీ), ఎస్‌వీ రాజశేఖర్ బాబు (విజయవాడ పోలీసు కమిషనర్).
Details
ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైన ఐపీఎస్ అధికారులు
ఆకే రవికృష్ణ (ఈగల్ విభాగం ఐజీ), ఆర్. జయలక్ష్మి (ఏసీబీ డైరెక్టర్), గోపినాథ్ జెట్టీ (విశాఖపట్నం రేంజ్ డీఐజీ), ఎస్. సెంథిల్ కుమార్ (డీఐజీ, ఆక్టోపస్), డా. షిముషి (అనంతపురం రేంజ్ డీఐజీ), డా. కోయ ప్రవీణ్ (కర్నూలు రేంజ్ డీఐజీ), ఏఆర్ దామోదర్ (విజయనగరం జిల్లా ఎస్పీ), డి. నరసింహ కిషోర్ (తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ), వి. గీతాదేవి (నిఘా విభాగం ఎస్పీ). ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ విభాగం అధికారులు, సిబ్బంది అందించిన సేవలను కేంద్రం గుర్తించి ఈ పతకాలు ప్రకటించడం గర్వకారణమని డీజీపీ తెలిపారు.