LOADING...
Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ 
అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. వెంకటపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. "ప్రజా రాజధాని అమరావతిలో వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణం. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించేలా తీర్చిదిద్దటమే తమ ధ్యేయమన్నారు. వాజ్‌పేయి స్మృతి వనం నిర్మాణంలో స్థానిక రైతుల త్యాగం ప్రధాన స్ఫూర్తి" అని పేర్కొన్నారు.

వివరాలు 

స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు 

"చరిత్రలో నిలిచేలా వాజ్‌పేయికి ఘనమైన నివాళి ఇవ్వడానికి స్మృతి వనం నిర్మిస్తున్నాం. అటల్ మోదీ సుపరిపాలన యాత్రను బీజేపీ ప్రారంభించింది. 26 జిల్లా కేంద్రాల్లో వాజ్‌పేయి విగ్రహాలను ప్రతిష్టిస్తూ కూటమి పార్టీలు సంయుక్తంగా పనిచేశాయి. అమరావతిలో విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలన విషయాలను ప్రజలకు తెలిసేలా స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నాం" అని చంద్రబాబు తెలిపారు.

వివరాలు 

వాజ్‌పేయి, ఎన్టీఆర్ అనుబంధం 

"నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకీకృతం చేసిన నాయకుడు ఎన్టీఆర్. వాజ్‌పేయి, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమైంది. వాజ్‌పేయి ప్రజాహృదయ నేత, కవీ, మంచి వక్తగా దేశ మౌలిక సదుపాయాల పునాది వేసారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొదట తడ-చెన్నై మధ్య ప్రారంభించడం, టెలికాం రంగంలో డీరెగ్యులేషన్ ద్వారా నాలెడ్జి ఎకానమీని బలపరచడం ఆయన ఘన కృషి" అని తెలిపారు.

Advertisement

వివరాలు 

దేశాన్ని అణుశక్తిగా మార్చిన నేత 

"అప్పటి ప్రధాని వాజ్‌పేయి దేశాన్ని అణుశక్తిగా తీర్చిదిద్దారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన ధైర్యాన్ని చూపించారు. ప్రధాన మంత్రి మోదీ ప్రస్తుతం సింధూర్ ప్రాజెక్ట్ ద్వారా దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నారు. వాజ్‌పేయి ప్రతిపాదించిన ప్రాజెక్టులు, నిర్మాణాలు దేశానికి చిరస్మరణీయంగా నిలిచాయి" అని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతుల సంక్షేమం, అమరావతి అభివృద్ధి "రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ అమరావతి అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నాం. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. "గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం.నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది.

Advertisement

వివరాలు 

పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు 

పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ప్రయత్నిస్తుంటే దానికి కొందరు అడ్డుపడుతున్నారని తెలిపారు. కానీ ప్రాజెక్టులు వేగంగా, సమర్థవంతంగా నడిచే ఏకైక మార్గం పీపీపీ. గత 30 సంవత్సరాల అనుభవం దీనిని నిరూపించింది. పీపీపీ అంటే ప్రైవేటు కాదు ప్రభుత్వ ఆస్తే.నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. 'కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు.. ఇలాంటి వ్యక్తుల స్వభావం ప్రజలు అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి వంటి గొప్ప నేతలతో రాజకీయం చేసి, ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాన్ని చేయటం సిగ్గు అనిపిస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఈ అభివృద్ధి యాత్ర కొనసాగుతుంది. ప్రజలకు సంపద, ఆరోగ్యం, ఆనందం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం" అని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

Advertisement