Loading...
PhonePe: ఫోన్‌పేలో ఎఫ్‌డీ, ఆర్‌డీ సేవలు.. రోజుకు రూ.100తో పొదుపు
ఫోన్‌పేలో ఎఫ్‌డీ, ఆర్‌డీ సేవలు.. రోజుకు రూ.100తో పొదుపు

PhonePe: ఫోన్‌పేలో ఎఫ్‌డీ, ఆర్‌డీ సేవలు.. రోజుకు రూ.100తో పొదుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD) పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (NBFCs) భాగస్వామ్యంతో వినియోగదారులకు ఎఫ్‌డీలను అందించేందుకు కొత్తగా ఎఫ్‌డీ మార్కెట్‌ప్లేస్‌ సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా ఫోన్‌పే యాప్‌లోనే వివిధ ఎఫ్‌డీలను పోల్చి చూసి, సులభంగా డిపాజిట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఇదే సమయంలో శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుని డైలీ రికరింగ్‌ డిపాజిట్‌ (Daily RD) సేవలను కూడా ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది.

వివరాలు

ఎఫ్‌డీ మార్కెట్‌ప్లేస్‌ ఎలా పనిచేస్తుంది?

ఫోన్‌పే యాప్‌లోని 'మ్యూచువల్‌ ఫండ్స్, డిపాజిట్స్‌' విభాగం ద్వారా వినియోగదారులు ఎఫ్‌డీలను బుక్‌ చేసుకోవచ్చు.

ఇందుకోసం ఎలాంటి పేపర్‌వర్క్‌ అవసరం లేదు. మొత్తం ప్రక్రియను 100 శాతం డిజిటల్‌ విధానంలో పూర్తి చేసేలా ఈ సేవను రూపొందించారు.

వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే ఎఫ్‌డీలను పోల్చి చూసి తమకు అనుకూలమైన డిపాజిట్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల వరకు ఉన్న డిపాజిట్లకు బీమా రక్షణ లభిస్తుంది.

వివరాలు

రోజుకు రూ.100తో డైలీ ఆర్‌డీ

శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో కలిసి ప్రారంభించిన డైలీ రికరింగ్‌ డిపాజిట్‌ సేవ ద్వారా రోజువారీగా పొదుపు చేసే అవకాశం కల్పించారు.

వినియోగదారులు తమకు నచ్చిన విధంగా రోజుకు కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.1,000 వరకు పొదుపు చేయవచ్చు.

యూపీఐ ఆటోపే సదుపాయంతో ఈ మొత్తం ఆటోమేటిక్‌గా వినియోగదారుల బ్యాంక్‌ ఖాతా నుంచి డైలీ ఆర్‌డీలోకి జమ అవుతుంది.

దీంతో ప్రతిరోజూ ప్రత్యేకంగా డబ్బు జమ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. డైలీ ఆర్‌డీలో పెట్టుబడి పెట్టిన ఏడు రోజుల తర్వాత వినియోగదారులు తమ సొమ్మును ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

అలాగే, అవసరమైతే యూపీఐ ఆటోపే మ్యాండేట్‌ను కూడా నిలిపివేయవచ్చు.

ADVERTISEMENT