Manchu Manoj: మౌనికను చూసి గర్వంగా ఉంది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్!
ఈ వార్తాకథనం ఏంటి
తన భార్య మౌనిక వ్యాపార ప్రయాణంపై నటుడు మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లుగా 'నమస్తే వరల్డ్' సంస్థ కోసం ఆమె చేసిన కృషి ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ఈ స్టార్టప్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
వివరాలు
మౌనిక కష్టానికి దక్కిన గుర్తింపు
మౌనికా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఐదేళ్లుగా పట్టుదలతో నువ్వు చేసిన కష్టమే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది.
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. తిరుపతిలో మన తొలి ఎంఓయూ కుదిరిన మూడు వారాల్లోనే ఈ ఘనత సాధించాం. మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఘనత నీదేనని మనోజ్ ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్లోని కళాకారులు, నేత కార్మికులు, చేనేత రంగంలోని మహిళలతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆయన వివరించారు.
వారి కళను, భారతదేశ కథలను బొమ్మలు, యానిమేషన్, సినిమాలు, ఏఐ, రోబోటిక్స్ ద్వారా పిల్లలకు చేరువ చేయాలనేది తమ ఆలోచన అని వెల్లడించారు.
వివరాలు
అభిమానులకు కృతజ్ఞతలు
తన కష్టకాలంలో అండగా నిలిచిన అభిమానులకు కూడా మనోజ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తన భార్యకు ఎప్పుడూ తోడుగా ఉంటూ, తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
''చేయాల్సింది చాలా ఉంది. మౌనిక పక్కన నిలబడి నా వంతు కృషి చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు.
వివరాలు
ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ
ఇక వైజాగ్ వేదికగా జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో 'నమస్తే వరల్డ్' స్టార్టప్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో రూ.36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది.
ఈ ఒప్పందంపై మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేస్తూ భార్య మౌనికను అభినందించారు.