Boat Accident: మిసిసిపి నదిలో పెను ప్రమాదం.. క్రూజ్ నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని మిసిసిపి నదిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. న్యూ ఓర్లీన్స్ పోర్టు వద్ద నిలిపి ఉంచిన ఐదు అంతస్తుల 'అమెరికన్ హెరిటేజ్' క్రూజ్ నౌకను 'అట్లాంటిక్ ఆస్ఫాల్ట్' అనే భారీ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి క్రూజ్ నౌక అద్దాలు, లోహపు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వివరాలు
నీటిలోకి దూకిన ప్రయాణికులు, సిబ్బంది
ట్యాంకర్ ఢీకొట్టిన కొద్దిసేపటికే క్రూజ్ నౌకలోకి నీరు చేరింది. దీంతో నౌక ఒకవైపునకు ఒరిగిపోయింది.
ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది ప్రాణభయంతో నదిలోకి దూకారు.
ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించిన సిబ్బంది
ప్రమాదం జరిగిన వెంటనే ఇతర నౌకల ఆపరేటర్లు, పోర్టు సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టి, నదిలో చిక్కుకున్న డజన్ల కొద్దీ ప్రయాణికులను సమీపంలోని నౌకల్లోకి లాగి రక్షించారు.
ప్రమాదం జరిగిన సమయంలో క్రూజ్ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 180 మంది ఉన్నారు.
ఈ ఘటనలో సుమారు 32 మంది గాయపడినట్లు సమాచారం. నదిలోకి ఒరిగిపోయిన క్రూజ్ నౌకకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.