Loading...
Anthropic IPO: ఆంత్రోపిక్ ఐపీఓకు భారీ క్రేజ్.. ఆరు రెట్లు అధికంగా దరఖాస్తులు
ఆంత్రోపిక్ ఐపీఓకు భారీ క్రేజ్.. ఆరు రెట్లు అధికంగా దరఖాస్తులు

Anthropic IPO: ఆంత్రోపిక్ ఐపీఓకు భారీ క్రేజ్.. ఆరు రెట్లు అధికంగా దరఖాస్తులు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్లాడ్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసిన ఆంత్రోపిక్ సంస్థ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే దాదాపు ఆరు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో షేర్ల కేటాయింపులో ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఆశించినన్ని షేర్లు దక్కకపోవచ్చు.

Details

ఐపీఓ ద్వారా 64.4 బిలియన్ డాలర్ల సమీకరణ

ఆంత్రోపిక్, దాని ప్రస్తుత వాటాదారులు కలిసి ఐపీఓ ద్వారా గరిష్ఠంగా 64.4 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక్కో షేరు ధరను 70 నుంచి 78 డాలర్ల మధ్య నిర్ణయించారు. మొత్తం 82.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

మరోవైపు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా అదనంగా 26 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రణాళిక ఉంది.

ఈ రెండు లావాదేవీలు కలిపి 90.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. కంపెనీ విలువను సుమారు 1.4 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

Details

నవంబర్ 19 నుంచి నాస్‌డాక్‌లో ట్రేడింగ్

ఆంత్రోపిక్ షేర్లు నవంబర్ 19 నుంచి నాస్‌డాక్ గ్లోబల్ సెలెక్ట్ మార్కెట్‌లో ANT గుర్తుతో ట్రేడింగ్ ప్రారంభించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్నారు.

ఈ ఐపీఓను గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ ముందుండి నిర్వహిస్తున్నాయి. మరో 20 బ్యాంకులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

ADVERTISEMENT

Details

ఎన్విడియా సహా టెక్ దిగ్గజాల పెట్టుబడులు

ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లో ఎన్విడియా సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

గూగుల్, ఏఎండీ, మైక్రోసాఫ్ట్, బ్రాడ్‌కామ్, మైక్రాన్, టీఎస్‌ఎంసీ వంటి సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.

ఏఐ మోడళ్ల అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన అధునాతన కంప్యూటింగ్ సదుపాయాల కోసం ఆంత్రోపిక్ భారీగా ఖర్చు చేస్తోంది.

ADVERTISEMENT

Details

ఆదాయ వృద్ధే ప్రధాన ఆకర్షణ

అక్టోబర్ 31 నాటికి సంస్థ ఆదాయ రన్‌రేట్ 81 బిలియన్ డాలర్లకు చేరింది. సెప్టెంబర్ చివరితో పోలిస్తే ఇది 10 బిలియన్ డాలర్లు ఎక్కువ.

జులై చివర్లో ఈ అంచనా 65 బిలియన్ డాలర్లుగా ఉంది. వేగంగా పెరుగుతున్న వ్యాపారం, ఏఐపై పెట్టుబడిదారుల ఆసక్తి ఈ భారీ ఐపీఓకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT