ప్రపంచ ఆరోగ్య సంస్థ: వార్తలు

యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు

కొత్త పరిశోధన ప్రకారం, సాధారణంగా లభించే యాంటీబయాటిక్, కలయిక తర్వాత తీసుకుంటే, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) నిరోధించచ్చు. అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్న 72 గంటలలోపు తీసుకున్న డాక్సీసైక్లిన్ ఒక మోతాదు మూడు STIల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

04 Mar 2023

అమెరికా

కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు

చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్టీ డిపార్ట్‌మెంట్ ఆరోపించిన నేపథ్యంలో బీజింగ్ దాన్ని తిరస్కరించింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది.

ఎబోలాను పోలిన వైరస్: ఈక్వటోరియల్ గినియాలో 9మంది మృతి; డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్

సెంట్రల్ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలాను పోలిన మార్బర్గ్ వైరస్ సోకి తొమ్మిది మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రాణాతకమైన ఈ వైరస్ సోకడం వల్ల జ్వరంతోపాటు రక్తస్రావమై వారు మరణించినట్లు తెలిపింది.

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. 2022లో కలుషితమైన దగ్గు సిరప్‌లు తాగి అనేక మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరిక జారీ చేసింది.

21 Jan 2023

జబ్బు

చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం

చికెన్‌పాక్స్ అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే ఒక సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇది అంటువ్యాధి, ముఖ్యంగా ఇంతకు ముందు ఈ వ్యాధి రాని లేదా పూర్తిగా టీకాలు వేయని వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు ఈ వైరస్ వల్ల హాని ఉంది. ఈ పిల్లలకు చికెన్ పాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ

నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది.

31 Dec 2022

చైనా

చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ

చైనాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో బీజింగ్‌పై ఆంక్షలు విధించే దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యూకే, ఫ్రాన్స్, భారత్ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో చైనాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలపై తాజాగా నివేదికలను అందించాలని చైనాను డబ్య్లూహెచ్ఓ కోరింది.

28 Dec 2022

కోవిడ్

హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

ఫార్మా దిగ్గజం హెటిరో మరో మైలు రాయిని అధిగమించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా ఔషధం 'నిర్మాకామ్' ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. కరోనా రోగులకు అందించే.. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధానికి 'నిర్మాకామ్' అనేది జెనరిక్‌ ఔషధం.