కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం జనం పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు. భయంకరమైన విషయం ఏంటంటే ఏటా 67 లక్షల మందికిపైగా వాయు కాలష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ లెక్కలు ఏ దేశమో చెప్పింది కాదు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన అంశాలే. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ గాలి నాణ్యతపై ఓ అధ్యయనం చేపట్టింది.
దాని ఫలితాల ఆధారంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ సదరు నివేదికను రిలీజ్ చేసింది. అయితే భారత్ లో మనం సేఫ్ అని అనుకుంటే పొరపాటే.
కాదు, టాప్ 20 వాయు కాలుష్యాలు వెదజల్లే నగరాల్లో భారతదేశానికి సంబంధించినవే 14 ఉన్నాయని ఆ నివేదిక చెప్పిన రిపోర్టు అందరినీ కలవరపరుస్తోంది.
DETAILS
కాలుష్య కోరల్లో చిక్కుకున్నవన్నీ ఉత్తరాది నగరాలే
టాప్-20 వాయు కాలుష్య నగరాలు ఇదిగో :
1. లాహోర్ (పాకిస్తాన్)
2. హోటన్ (చైనా)
3. భివండీ, దిల్లీ (భారత్)
4. పెషావర్ (పాకిస్తాన్)
5. ఎన్‌డీజమేనా (చాద్), దర్భంగా, అసోపూర్, పట్నా, ఘజియాబాద్, ధరెహారా (భారత్)
6. బాగ్దాద్ (ఇరాక్)
7. ఛాప్రా, ముజఫర్‌నగర్ (భారత్)
8. ఫైసలాబాద్ (పాకిస్తాన్)
8. గ్రేటర్ నోయిడా, బహదూర్‌ఘర్,ముజఫర్‌పూర్, ఫరీదాబాద్ (భారత్)
ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్-20 నగరాల జాబితాలో భారత్ నుంచే అత్యధిక శాతం నగరాలుండటం ఆందోళనకరంగా పరిణమించింది.అయితే ఈ జాబితాలో దక్షిణాది రాష్ట్రాలేవీ లేకపోవడం గమనార్హం.
వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో దాన్ని తగ్గించేందుకు ఓ వైపు చర్యలు చేపడుతుంటే, వాటి స్థానంలో కొత్త నగరాలు పుట్టుకొస్తుండటం బాధాకరం.
DETAILS
32 లక్షల మందికిపైగా వంటింటి పొగతో చనిపోతున్నారు: డబ్ల్యూహెచ్ఓ
2022 ఏడాదికి సంబంధించి దాదాపుగా 117 దేశాలు, 6 వేల నగరాల్లో ఎయిర్ క్వాలిటీని పరీక్షించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
మరికొన్ని దేశాల్లో పరికరాలు లేని కారణంగా పరీక్షలు నిర్వహించలేదన్న డబ్ల్యూహెచ్‌ఓ, అలాంటి వాటిలో చాలా వరకు నగరాలు వాయు కాలుష్యం బారిన పడే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేసింది.
కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాయు కలుషితాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వాయు కాలుష్యం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఏటా 32 లక్షల మందికిపైగా వంటింటి పొగకు బలవుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ద్వారా స్పష్టం చేసింది.
DETAILS
వాయు కాలుష్యంతో ఎన్నో దీర్ఘకాలిక రోగాలు
ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టుముడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
ఈ మేరకు కలుషిత గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని వివరించింది.
వాయు కాలుష్య మరణాలు ఎవరెవరు ఎలా :
1. 32 శాతం మంది ఇస్కామిక్ హర్ట్ డిసీజ్‌తో
2. 23 శాతం మంది గుండెపోటుతో
3. 21 శాతం లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్
4. 19 శాతం క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్
5. ఆరు శాతం మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణిస్తున్నారు.
వాయు కాలుష్యాన్ని నివారించి, నాణ్యతా ప్రమాణాలను పెంచుకోవాలని కోరిన ఆరోగ్య సంస్థ, వాయు కాలుష్య కారకాలను గుర్తించి నియంత్రించాలని సూచించింది.
DETAILS
వాయు కలుష్య నిర్మూలనకు ఏం చేయాలో చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
కాలుష్య నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ :
1. కాలుష్య నియంత్రణ చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నిత్యం పర్యవేక్షించి, వంటకు కావాల్సిన కాలుష్య రహితమైన, నాణ్యమైన ఇంధనాన్ని అందించాలి.
2. సామాన్యులకు సురక్షితమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వాకర్స్ కు, సైక్లింగ్ ఫ్రెండ్లీ నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలి.
3. వాహన కాలుష్యాన్ని అరికట్టేలా కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా దాని అమలు బాధ్యతను సైతం నిత్యం పర్యవేక్షించేలా ఓ పటిష్ట అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయాలి.
4. పరిశ్రమల వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల యాజమాన్య నిర్వహణను మరింత పెంచుకోవడంతో పాటు పంట వ్యర్థాలను తగలబెట్టడం నిలిపివేయాలి. ఫలితంగా అగ్నిప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. పొగ రాకుండా ఉంటుంది.