
Asia Cup 2025 : ఆసియాకప్‌లో సూపర్-4కు చేరిన 4 జట్లు.. మ్యాచ్‌ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో సూపర్-4 దశకు చేరిన జట్లు ఖరారయ్యాయి.ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు ముందుకు వచ్చాయి. గురువారం జరిగిన శ్రీలంక-అఫ్గానిస్తాన్ పోరుతో మరో రెండు జట్లు ఖరారు అయ్యాయి. ఆ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన శ్రీలంక వరుసగా మూడు గెలుపులతో గ్రూప్-బీ టాప్ జట్టుగా సూపర్-4లోకి అడుగుపెట్టింది. అఫ్గానిస్తాన్ పోటీ నుంచి తప్పుకోగా, బంగ్లాదేశ్ కూడా తదుపరి దశలోకి ప్రవేశించింది. ఎనిమిది జట్లతో ప్రారంభమైన ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో సూపర్-4కు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించాయి. మరోవైపు ఒమన్, యూఏఈ, హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్ల ప్రయాణం గ్రూప్ దశలోనే ముగిసిపోయింది.
వివరాలు
సూపర్-4 షెడ్యూల్ ఇలా ఉంది:
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్-4 రౌండ్‌లో ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అందులో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ పోరులో తలపడతాయి. టీమిండియా షెడ్యూల్ ప్రకారం-సెప్టెంబర్ 21న పాకిస్తాన్‌తో,24న బంగ్లాదేశ్‌తో,26న శ్రీలంకతో తలపడనుంది. సెప్టెంబర్ 20న - శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ సెప్టెంబర్ 21న - భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెప్టెంబర్ 23న - పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక సెప్టెంబర్ 24న - భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సెప్టెంబర్ 25న - పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ సెప్టెంబర్ 26న - భారత్ వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.