
Gold and Silver Rates: బంగారం,వెండి కొనాలని చూస్తున్న వారికి శుభవార్త.. మూడు రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం,వెండి కొనుగోలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. సెప్టెంబర్ 19, 2025 ఉదయం 6 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌లో నమోదైన తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,160కి తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది సుమారు రూ.540 వరకు తక్కువగా నమోదైంది. 22 క్యారెట్ బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,01,890గా ఉంది. మరోవైపు వెండి ధరల్లో మరింత గమనించదగ్గ మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.1,40,900కి పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం.
వివరాలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు
భారతదేశంలోని వివిధ నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,160 నుంచి రూ.1,11,480 వరకు మారుతోంది. హైదరాబాద్‌లో రూ.1,11,160గా ఉండగా, ముంబై, కేరళ, పూణే, కోల్‌కతాల్లో కూడా అదే ధర కనిపించింది. ఢిల్లీలో రూ.1,11,310, చెన్నైలో కొంచెం ఎక్కువగా రూ.1,11,480గా నమోదైంది. 22 క్యారెట్ బంగారం ధరల్లో కూడా ఇలాగే స్థిరత్వం ఉంది. హైదరాబాద్, ముంబై, పూణే, కోల్‌కతా, కేరళలో 10 గ్రాములకు రూ.1,01,890గా ఉండగా, చెన్నైలో మాత్రం రూ.1,02,190గా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తగ్గుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు విధానాలు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
వివరాలు
వెండి రేట్ల పరిస్థితి
వెండి ధరలు అయితే బంగారంతో పోలిస్తే మరింతగా క్షీణించాయి. నిన్నటి కంటే కిలో వెండి ధర దాదాపు రూ.4,000 వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి రూ.1,40,900గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, వడోదరల్లో రూ.1,30,900గా నమోదైంది. నిపుణులు చెబుతున్నట్లుగా, అంతర్జాతీయ సిల్వర్ మార్కెట్‌లో సరఫరా పెరగడం, డిమాండ్ తగ్గడం వల్ల ఈ తగ్గుదల చోటుచేసుకుంది.
వివరాలు
మార్పుల ప్రభావం
ఇటీవల బంగారం ధర తగ్గడం కొనుగోలు దారులకు లాభదాయకం కానుంది. ఇక వెండి ధరల్లో భారీ పతనం రావడంతో దసరా, దీపావళి పండగల ముందు ఇది పెట్టుబడిదారులకు కూడా ఒక మంచి అవకాశంగా మారింది. అయితే వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశాల అంశాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకోవాలి