మోమోస్ తింటూ దొరికిపోయిన 4 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి: అసలేం జరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
చనిపోయిన మనుషులు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చారనే వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన బీహార్ లో జరిగింది.
4నెలల క్రితం బీహార్ లో చనిపోయిన వ్యక్తి నోయిడాలో మోమోస్ తింటూ స్టాల్ ముందుకు కనిపించడం షాకింగ్ గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?
బీహార్ రాష్ట్రం భగల్పూర్ ప్రాంతానికి చెందిన నిషాంత్ కుమార్ అనే వ్యక్తి జనవరి 31వ తేదీన తన బావ రవిశంకర్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు.
రవిశంకర్ కుటుంబ సభ్యులు ఎంత వెదికినా నిషాంత్ కుమార్ దొరకలేదు. దీంతో, నిషాంత్ కుమార్ కుటుంబసభ్యులు, రవిశంకర్ ఫ్యామిలీపై హత్యా నేరన్ని మోపారు. నిషాంత్ ను రవి కుటుంబమే చంపేసిందని ఆరోపించారు.
Details
మోమోస్ స్టాల్ వద్ద ప్రత్యక్షమైన చనిపోయిన వ్యక్తి
హత్యారోపణలను తట్టుకోలేక రవిశంకర్ వాళ్ళ పెద్ద అంకుల్ చనిపోయాడు. 4నెలల తర్వాత నోయిడా చేరుకున్న రవిశంకర్, ఒకానొక టైమ్ లో మోమోస్ స్టాల్ వద్ద ఆహారం కోసం స్టాల్ ఓనర్ ని బతిమాలుతున్న పిచ్చివాడిని చూసాడు.
ఆ స్టాల్ ఓనర్ ఆహారం ఇవ్వకుండా పిచ్చివాడిని తరిమేయడం చూసి చలించి, తన డబ్బులతో మోమోస్ తినిపించాడు. ఆ తర్వాత అతని వివరాలు అడగడంతో, తన పేరు నిషాంత్ కుమార్ అని తన వివరాలన్నీ చెప్పుకొచ్చాడు.
అది విని షాకైన రవిశంకర్, తన ఇంట్లోంచి పారిపోయిన నిషాంత్ కుమార్ అతనేనని గుర్తించి వెంటనే సెక్టార్ 13పోలీసులకు నిషాంత్ ను అప్పగించాడు. తమ మీద హత్యా నేరం మోపిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాడు రవిశంకర్.