Covid 19: కోవిడ్-19 తొలి కేసుకు 5 ఏళ్లు.. తమ వద్ద సమాచాారాన్ని డబ్ల్యూహెచ్ఓకి షేర్ చేశామన్న చైనా
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటి తరం కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్రలో కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి అనేక మహమ్మారులు ఉండేవి.
అయితే వైద్య రంగం అభివృద్ధి చెందడంతో చాలా కాలంగా పెద్ద మహమ్మారుల గురించి వినిపించలేదు.
2019లో చైనాలోని వూహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది.
డిసెంబర్ 31, 2019న తొలి కరోనా కేసు నమోదైంది, మొదట దీనిని "వైరల్ న్యూమోనియా" అని పిలిచారు.
తరువాత కరోనా వైరస్ ద్వారా కలిగే కోవిడ్-19 అని గుర్తించారు. భారత్‌లో మొదటి కేసు 2020 జనవరి 30న కేరళలో నమోదైంది, ఇది వూహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న త్రిసూర్ నివాసికి సంబంధించినది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కోవిడ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇటలీ, అమెరికా, భారత్, చైనా వంటి ప్రధాన దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
మానవ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా దేశాలు తమ సరిహద్దులను మూసివేశాయి.
ప్రజలు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచం దీనిని నివారించేందుకు వేగంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది.
అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు
దీనిపై మరింత సమాచారం పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది.
దీనికి ప్రతిస్పందనగా, తమ వద్ద ఉన్న డేటా, పరిశోధన ఫలితాలను పంచుకున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోవిడ్-19 మూలాలను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో చర్చలు జరిపిన ఏకైక దేశం చైనానే అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.
WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు, 6.9 మిలియన్ మరణాలు నమోదయ్యాయి.