వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO
కోవిడ్ 19 సృష్టించిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు పడింది. ప్రస్తుతం కోవిడ్ 19 వ్యాప్తి తగ్గిపోయినప్పటికీ కొత్త వేరియంట్లు బయటకు రావడం ఇబ్బందిగా ఉంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ ని కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కరోనా కొత్త వేరియంట్ కి BA.2.86 అని పేరు పెట్టారు. చాలా దేశాల్లో ఈ రకం వేరియంట్ కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది.
ఇజ్రాయెల్, డెన్మార్క్, అమెరికా దేశాల్లో బయటపడ్డ వేరియంట్
మొదటిసారిగా జులై 24వ తేదీన BA.2.86 వేరియంట్ ని కనుగొన్నారు. ఆగస్టు 17వ తేదీన వేరియంట్ అండర్ మానిటరింగ్ విభాగంలో చేర్చారు. ఇజ్రాయెల్, డెన్మార్క్, అమెరికా దేశాల్లో BA.2.86 వేరియంట్ కరోనా వేరియంట్ రకం బయటపడిందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలియజేసింది. అయితే ఈ కరోనా వేరియంట్ పై మరిన్ని పరిశోధనలు జరిగితే కానీ దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకోలేమని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇటు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది.