Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా విజయ్-రష్మిక
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ నటుడు అల్లు శిరిష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. వివాహానికి ముందు జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. వరుడికి పసుపు రాయడం, పెద్దల ఆశీర్వాదాలు అందించడం వంటి ఆచారాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుటుంబ పెద్దలు, బంధువులు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వేడుక అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ తన సోదరుడికి ఆశీస్సులు అందించగా, రామ్ చరణ్, ఉపాసానా దంపతులు, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల సురేఖ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
Details
సోషల్ ఫోటోలు వైరల్
వేడుకలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయనకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. వీరి హాజరు వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. అల్లు కుటుంబంతో విజయ్, రష్మికలకు ఉన్న సాన్నిహిత్యం మరోసారి స్పష్టమైంది. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన గీతా గోవిందంలో విజయ్-రష్మిక జంటగా నటించారు. అలాగే రష్మిక, అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా హాజరైనట్లు సమాచారం.
Details
సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం
అల్లు అరవింద్-బాలయ్య మధ్య ఉన్న అనుబంధం తెలిసిందే. ఇక అల్లు శిరీష్-నయనిక వివాహం మార్చి 6న ఘనంగా జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారని సమాచారం. హీరోగా పలు చిత్రాల్లో నటించిన శిరీష్, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. మొత్తంగా అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుకలో మెగా కుటుంబం సందడి చేయగా, విజయ్-రష్మిక హాజరు వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది. అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.