China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనాలో విస్తరిస్తున్న కొత్త వ్యాధి 'న్యుమోనియా(Pneumonia) '. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది.
కొన్ని వారాలుగా చైనా(China)లో న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, టీనేజర్స్ పెద్ద సంఖ్యలో ఆస్పత్రిలో చేరుతున్నారు. ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేశారు.
ఆస్పత్రులు న్యుమోనియా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO) ఈ వ్యాధికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను చైనా నుంచి కోరింది.
ఈ క్రమంలో చైనా న్యుమోనియాపై భారత్ కూడా అప్రమమత్తమైంది. ఈ నేపథ్యంలో అసలు చైనాలో విస్తురిస్తున్న కొత్త వ్యాధి ఏమిటి? భారత్ తీసుకుంటున్న చర్యలు ఏంటో తెలుసుకుందాం.
చైనా
వైరస్? లేదా బ్యాక్టీరియా? క్లారిటీ ఇవ్వని చైనా
చైనాలో విస్తరిస్తున్న న్యుమోనియాకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అది వైరస్ అని కొందరు.. బ్యాక్టీరియా అని మరికొందరు చెబుతున్నారు.
కానీ అది ఏంటి అనేది చైనా ఇంకా వెల్లడించలేదు. ఇంతకుముందు న్యుమోనియాకు కారణమైన దాన్ని H9N2 వైరస్ అని పిలిచేవారు.
ఇన్‌ఫ్లూయెంజా A వైరస్‌కు ఉపరకం. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.
ప్రస్తుతం వ్యాప్తిస్తున్నది H9N2 వైరస్ ఇదే అని మాత్రం స్పష్టంగా తెలియకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చైనాలో ప్రస్తుతం వ్యాప్తిస్తున్న న్యుమోనియా కేవలం పిల్లలు, టీనేజర్స్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీంతో ఈ వ్యాధిపై అనుమానాలు మరింత ఎక్కవయ్యాయి.
చైనా
ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్న పిల్లల్లో లక్షణాలు ఇవీ..
న్యుమోనియాతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో పిల్లలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ముఖ్యంగా బీజింగ్, లియానింగ్ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో రోజుకు వేలాది మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు.
ఆస్పత్రుల్లో చేరుతున్న పిల్లల్లో అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మంట, ఊపిరితిత్తుల్లో వాపు ఉన్నాయి. కరోనా మాదిరిగా వైరస్ కూడా ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ఈ న్యుమోనియా బాధితుల్లో దగ్గు రాకపోవడం గమనార్హం. అలాగే ఊపిరితిత్తులలో చాలా ఎక్కువ జ్వరం, వాపు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
చైనా న్యుమోనియా గురించిన పూర్తిస్థాయి సమాచారం బయటకు రానప్పటికీ.. వ్యాప్తిని బట్టి చూస్తే.. ఇది ఒకరి నుంచి మరొకరి కచ్చితంగా వస్తుందని అర్థమవుతుందని నిపుణులు అంటున్నారు.
చైనా
న్యుమోనియాపై దాటవేస్తున్న చైనా.. డబ్ల్యూహెచ్‌ఓ ఏం అంటోంది?
న్యుమోనియా కేసుల పెరుగుదలపై నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ చైనాను కోరింది. అయితే చైనా మాత్రం ఈ న్యుమోనియా కొత్తదేం కాదని డబ్ల్యూహెచ్‌ఓకు చెప్పింది.
ఇది చైనా వచ్చే సాధారణ అనారోగ్యం అంటూ నివేదికను పంపింది. చైనాలో రోజుకు రోజుకు 1200-2000 కేసులు నమోదవుతున్నాయి.
అయితే ఇప్పటి వరకు ఈ కొత్త వ్యాధి బారిన పడి ఒక్కరు కూడా చనిపోలేదని చైనా చెబుతోంది.
చైనా కరోనా విషయంలో కూడా ఇలాగే చెప్పింది. ఇక్కడ అలాంటి వైరస్ కామన్ అని అప్పట్లో చెప్పింది. కానీ కరోనా తర్వాత ఎలాంటి విపత్తుకు కారణం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
చైనా
భారత్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవీ..
చైనాలో న్యుమోనియా వ్యాప్తి నేపథ్యంలో భారత్ కూడా ఆందోళన చెందుతోంది. చైనాలో కేసుల పెరుగుదలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. చైనా న్యుమోనియాపై అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు. వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, టెస్టింగ్ కిట్‌లు, ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి వెంటిలేటర్‌ల వరకు అన్నీ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రస్తుతం భారత్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కేంద్రం వెల్లడించింది. ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను సంసిద్ధం చేయాలని దిశానిర్దేశం చేసింది.