ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య
ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు అతిపెద్ద వ్యాప్తిగా వేగంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షీరదాల్లో బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెప్పారు. అయినప్పటికీ ఫ్లూ వల్ల మనుషులకు వచ్చే ప్రమాదం తక్కువగానే ఉంటుందన్నారు. 1996లో మొదటిసారిగా ఈ వైరస్ ను కనుగొన్నప్పటి నుంచి H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ గతంలో ఎక్కువ వ్యాప్తి చెందింది. దేశాలు తమ పౌల్ట్రీకి టీకాలు వేయాలని నిపుణులు హెచ్చరించారు. 2021 మధ్యలో ఏదో భయంకరంగా జరిగిందని, అది వైరస్‌ల సమూహాన్ని అంటు వ్యాధిగా మార్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ రిచర్డ్ వెబ్బీ ఆందోళన వ్యక్తం చేశారు.
పది మిలియన్ల పక్షులు మరణించాయి
అప్పటి నుంచి ఏడాది పొడవునా వ్యాప్తి కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాపించి, అటవీలోని పక్షుల మధ్య ముకుమ్మడి మరణాలకు దారితీసిందన్నారు. ఫలితంగా పది మిలియన్ల పక్షులు మరణించాయన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా అని అన్నారు. వెబ్బీ అమెరికాలోని మెంఫిస్ పరిధిలో ఉండే సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఆస్పత్రిలో పరిశోధకుడిగానూ పనిచేశారు. ఈ పక్షుల్లోని మెదడులో ఊహించని రీతిలో భారీ మొత్తంలో వైరస్ కనుగొన్నామని వెబ్బీ వివరించారు. ఇది మునుపటి జాతుల కంటే తీవ్రమైన వ్యాధికి కారణమైందగా అభివర్ణించారు. అరుదైన సందర్భాల్లో మానవుల్లో కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన వైరస్ గా సంక్రమిస్తుందన్నారు.