Page Loader
Corona Virus: ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక 
ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక

Corona Virus: ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక 

వ్రాసిన వారు Stalin
Dec 18, 2023
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 కేసులు చాలా దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కీలక హెచ్చరికలు జారీ చేసింది. శ్వాసకోశ వ్యాధులు, JN.1 ఉప వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో సభ్యదేశాలు నిత్యం నిఘా ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను పంచుకోవాలని చెప్పింది. కేసులు పెరగడానికి గల కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కోవిడ్ టెక్నికల్ లీడ్ డాక్టర్ వాన్ కెర్‌ఖోవ్ వివరించారు. ఇటీవలి కాలంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడానికి కరోనా మాత్రమే కాదని, అనేక కారణాలు ఉన్నట్లు చెప్పారు. ఇన్ఫ్లుఎంజా, ఇతర వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు వివరించారు.

కరోనా

సింగపూర్‌లో JN.1 వేరియంట్‌ బీభత్సం 

ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు శీతాకాలంలోకి ప్రవేశించాయని, ఈ సీజన్ కూడా శ్వాసకోశ వ్యాధులకు కారణం అని కెర్‌ఖోవ్ అన్నారు. కోరనా వైరస్ పరిణామం చెందడం వల్లనే కేసులు పెరుగుతున్నాయని, ప్రస్తుత కేసుల్లో 68 శాతం XBB సబ్‌లినేజ్, JN.1 వంటివి వెలుగుచూస్తున్నాయన్నారు. ప్రస్తుతం కరోనా అనేక దేశాల్లో విస్తరిస్తోందన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని కెర్‌ఖోవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, కొన్ని సందర్భాల్లో తేలికపాటి జీర్ణశయాంతర లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వివరించారు. సింగపూర్‌లో కోవిడ్‌కు చెందిన JN.1 వేరియంట్‌ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో దేశంలో రద్దీ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.