LOADING...
Motorola: భారత్‌లోకి వైర్‌లెస్ ఛార్జింగ్‌తో మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్‌.. డిసెంబర్ 23 నుంచి అమ్మకాలు
భారత్‌లోకి వైర్‌లెస్ ఛార్జింగ్‌తో మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్‌.. డిసెంబర్ 23 నుంచి అమ్మకాలు

Motorola: భారత్‌లోకి వైర్‌లెస్ ఛార్జింగ్‌తో మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్‌.. డిసెంబర్ 23 నుంచి అమ్మకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 'మోటోరోలా ఎడ్జ్ 70' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. భారత్‌లో ఈ ఫోన్‌ను 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఒక్క వేరియంట్‌లో మాత్రమే విడుదల చేశారు.

Details

బ్యాంకు కార్డులపై డిస్కౌంట్

దీని ధరను రూ. 29,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఛానళ్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ గాడ్జెట్ గ్రే, పాంటోన్ లిల్లీ ప్యాడ్ రంగుల్లో లభించనుంది.

Details

మోటోరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్లు 

డిస్‌ప్లే: 6.7 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐ(Hello UI) ర్యామ్ / స్టోరేజ్: 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ వెనుక కెమెరాలు: 50MPప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రావైడ్ కెమెరా ముందు కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా బ్యాటరీ: 5000mAhసిలికాన్ కార్బన్ బ్యాటరీ ఛార్జింగ్: 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇతర ఫీచర్లు: IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, మోటో ఏఐ టూల్స్

Advertisement